Home  »  TV News  »  సుమ మెడలో పూల దండేసిన విరాజ్..."బేబీ"ని హగ్ చేసుకున్న కింగ్

Updated : Jul 27, 2023

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు  బిగ్ బాస్ సీజన్ 7 కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సందడి వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ ఐపోయింది. "కుడి ఎడమైతే" అంటూ కింగ్ నాగార్జున చెప్పారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ బిబి హౌస్‌మెట్స్ తో కలిసి  ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో  ఒక ప్రోమో రిలీజ్ చేశారు. దానికి  మంచి రెస్పాన్స్ వచ్చింది.  బిగ్ బాస్‌లోని సిక్స్ సీజన్స్‌లో ఉన్న స్టార్స్ అందర్నీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సందడి చేయడానికి రెడీ ఇపోయారు.  ఈ షైనింగ్ స్టార్స్ ఎపిసోడ్ కి  ‘బేబి’ టీమ్, ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్ ’ టీమ్ వచ్చారు. అలాగే  అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ కూడా వచ్చి  సందడి చేశారు.  

ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా  కూడా అద్భుతమైన సింగింగ్, డాన్సింగ్  పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. సుమ హోస్టింగ్ అంటే మామూలు విషయం కాదు. ‘బేబి’ టీం వచ్చేసరికి సుమకి ఇంకా జోష్ ఎక్కువయ్యింది. హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న మూడో అతను ఎక్కడ అని అడిగేసరికి ఆనంద్ దేవరకొండ షాకయ్యాడు. ఎవరూ దానికి ఆన్సర్ చెప్పలేదు. ఇక విరాజ్ ఐతే పూల దండను తీసుకొచ్చి సుమ మెడలో వేసేసి ఆమెతో కలిసి డాన్స్ చేసాడు. ఆ హఠాత్పరిణామానికి సుమ కూడా షాకైపోయింది.  తేజస్వి, మెహబూబా ఓ పాట చేశారు. ఇక కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాక అందరిలో మరింత జోష్ వచ్చింది. కింగ్ నాగ్ కూడా అందరితో ఆడి పాడారు... ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్ ’ మూవీ హీరోయిన్ ప్రణవి మానుకొండ ‘సోగ్గాడే చిన్ని నాయన’ లో తన పక్కన బాలనటిగా చేసిందని చెప్పారు. వెంటనే సుమ " ఈ పిల్ల పెద్దగా అయిపోయింది కానీ మనమిద్దరం ఇంకా అలాగే ఉన్నామంటూ" ఫన్నీ కౌంటర్ వేసింది.

తర్వాత వైష్ణవి చైతన్య "మీరంటే చాలా ఇష్టం’ అనేసరికి ఐతే ఒక హగ్ ఇవ్వు అన్నారు.  ‘‘బీబీ  7 టీజర్‌లో ‘కుడి ఎడమైతే’ అన్నారు. ఏంటి సార్?’’ అని సుమ అడిగింది. ‘ఓట్లు ఎలా కొట్టాలి, ఏంటి ? అని కంప్లీట్ గేమ్ ప్లే అంతా మైండ్‌లో సెట్ చేసుకుని వస్తున్నారు. ఈసారి అవన్నీ కుదరవ్. చూడు ఒకసారి.. చూసిన తర్వాత మాట్లాడదాం’ అన్నారు కింగ్ నాగ్..."మీ ఊహకు అందనివి ఇంకా ఉన్నాయి" అన్నారు అనిల్ రావిపూడి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.